హీరో తారకరత్న కారుకు ఫైన్
మొన్న జూనియర్ ఎన్టీఆర్...ఇవాళ తారక రత్న. రూల్స్ ఎవరికైనా రూల్సే. నిబంధనలకు విరుద్ధంగా వాహనానికి బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు సోమవారం సినీహీరో తారకరత్నకు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఇవాళ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న తారకరత్న కారును ఆపి, ఫైన్ వేశారు. అంతేకాకుండా కారుకు ఉన్న బ్లాక్ స్టిక్కర్ తొలగించారు. కాగా ఇదే విషయంలో ఐదు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ వాహనానికి కూడా పోలీసులు రూ.700 ఫైన్ వసూలు చేసిన విషయం తెలిసిందే.
source:సాక్షి దినపత్రిక
హీరో తారకరత్న కారుకు ఫైన్
Reviewed by newsreviews9
on
5:27 AM
Rating:
No comments: